తేజస్వి మాదివాడ. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సినిమాతో గుంపులో గోవిందా అంటూ పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈ పిల్ల చాలా యాక్టివ్. మహా గడుసుపిల్ల. అందుకే హీరోయిన్‌గానే కాకుండా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఓకే చేసేస్తుంది . అన్నట్లు ఈ ముద్దుగుమ్మ రామ్ గోపాల్ వర్మని కూడా ఇంప్రెస్ చేసేసింది. 'ఐస్‌క్రీమ్' సినిమాలో హీరోయిన్గా నటించేసింది. ప్రస్తుతం 'బాబు బాగా బిజీ' సినిమాతో ఇంకోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇందులో కొంచెం హాట్‌గా కనిపించనుందట. తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ మూవీ అని చెబుతోంది ఈ సినిమా గురించి. సినిమా ప్రమోషన్లో ఎక్కువగా ఈ బ్యూటీనే కన్పిస్తోంది. మిస్తి చక్రవర్తి, శ్రీముఖి, సుప్రియ తదితరులున్నా తేజస్వికే పబ్లిసిటీ బాగా దక్కుతోంది. అది తన అదృష్టమని చెబుతూ, సినిమా చాలా కొత్తగా ఉంటుందని చెబుతోంది. ఇదో అడల్ట్ కాన్సెప్ట్ మూవీ. బాలీవుడ్ 'హంటర్'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఏదేమైనా 'బాబు బాగా బిజీ' ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయట. సినిమా కోసం గ్లామర్ తప్పదంటోంది తేజస్వి. పరిమితులు పెట్టుకుంటే ఈ ప్రొఫిషన్‌లో నిలదొక్కుకోవడం కష్టమంటోంది. అంతేకాదండోయ్ గ్లామరస్‌గా కన్పించడం ఓ వరం అని అభిప్రాయపడింది ఈ చిలిపి పిల్ల. మే 5న 'బాబు బాగా బిజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.