'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే డౌట్ ఇంతవరకూ 'బాహుబలి ది బిగినింగ్' చూసిన వారందరికీ కల్గుతుంది. కానీ తాజాగా 'బాహుబలి ది కన్‌క్లూజన్' ట్రైలర్ చూసిన దగ్గర్నుంచీ బాహుబలిని కట్టప్ప చంపలేదనిపిస్తోంది. ట్రైలర్ వచ్చినాక సినిమాపై ఇలాంటి చాలా అనుమానాలు కల్గుతున్నాయి. కొత్త కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాహుబలిని కట్టప్ప చంపి ఉండడనిపిస్తోంది. ట్రైలర్‌లో 'నువ్వు నా పక్కనుండగా నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా..' అని ప్రబాస్ చెప్పే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గుండెకు హత్తుకునేలా అనిపిస్తోంది ఈ డైలాగ్. అందుకే బాహుబలిని కట్టప్ప చంపి ఉండడనే వాదన వినిపిస్తోంది ఒక వైపు. తాజాగా సినిమాకి సంబంధించి, ఇదో సస్పెన్స్ నెలకొంది. పోరాట ఘట్టాలు చూస్తుంటే తెరపై జక్కన్న ఈ సినిమాని ఇలా మలచడానికి ఎంత కష్టపడి ఉంటాడో అనిపిస్తోంది. రానా, ప్రబాస్‌ల మధ్య జరిగే పోరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా అనిపిస్తోంది. ట్రైలర్‌లో రాజమాత శివగామినుద్దేశించిన డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇక అనుష్క అందచందాలతో పాటు యుద్ధ నైపుణ్యాలు కూడా ఆకట్టుకునేలానే ఉన్నాయి. అలాగే తమన్నా ఉద్యమ నాయకురాలి పాత్రలోనే కనిపిస్తోంది ఈ పార్ట్‌లో కూడా. ఇక మొదటి పార్ట్‌లో ఉన్న అన్ని పాత్రలూ ఈ పార్ట్‌లో కనిపిస్తాయా? లేదా? ఇంకేమైనా కొత్త పాత్రలు యాడ్ అయ్యాయా అనే ఆశక్తి సర్వత్రా నెలకొంది 'బాహుబలి' ట్రైలర్ చూశాక.