హాట్ బ్యూటీ దిశా పటానీకి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. నెటిజన్లు ఆమెను ఫాలో అవుతుంటే, ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని ఫాలో చేస్తోంది. ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌లో బన్నీ ఓ బల్ల పై నుండి కిందికి జారే స్టెప్ ఉంటుంది.. ఆ స్టెప్‌కి దిశా పటానీ ఫిదా అయిపోయిందట. ఆ స్టెప్ మీరు ఎలా వేశారు.? అంటూ అల్లు అర్జున్‌ని అడుగుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మనసుకు నచ్చిన మంచి మ్యూజిక్ ఉంటే, డాన్స్ దానంతట అదే సాధ్యమవుతుంది.. మీ కాంప్లిమెంట్‌కి థాంక్స్..’ అంటూ అల్లు అర్జున్, దిశాకి రిప్లై ఇచ్చాడు.
అందాల ఆరబోతలోనే కాదు, డాన్సుల్లోనూ దిశా పటానీ ధిట్ట. ఆమె డాన్సులతో అంతా ఫిదా అవుతుంటే, ఆమె మాత్రం బన్నీ డాన్స్‌కి ఫిదా అయ్యిందన్నమాట. ఇదిలా ఉంటే, టాలీవుడ్లో ‘లోఫర్’.. ఒకే ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమైన దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో దుమ్ము దులిపేస్తోంది. ‘బాఫీు 2’లో ‘హీరోయిన్గా నటించిన దిశా పటానీ, రీసెంట్గా ‘బాఫీు 3’లో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకుంది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ ‘భారత్’లో హీరోయిన్గా నటించింది.