‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ కాంబో మూవీ సెట్స్ మీదికెళ్లేది. అయితే, కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ వాయిదా పడడం, అనుకున్న టైమ్‌కి రిలీజ్ అవుతుందో లేదో అనే డైలమాలో చిత్ర యూనిట్ ఉండడంతో, ఈ ప్రాజెక్ట్ మరి కాస్త లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ కరోనా టైమ్‌ని ఊరికే వదిలేయకుండా, త్రివిక్రమ్ స్క్రిప్టు పనుల్లో యాక్టివ్‌గా ఉన్నాడట. అసలే ‘అల వైకుంఠపురములో..’ సూపర్ హిట్‌తో ఫుల్ స్వింగ్ మీదున్న త్రివిక్రమ్, ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసే స్క్రిప్టుని పక్కా లెక్కలతో పూరిస్తున్నాడట.
అంతేకాదు, ఈ సారి త్రివిక్రమ్ ప్యాన్ ఇండియాపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో రూపొందించే ఆలోచన చేస్తున్నాడట. ఆ దిశగానే స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడనీ తెలుస్తోంది. ఇప్పటికే సింపుల్‌గా ఎన్టీఆర్‌కి స్టోరీ వినిపించేశాడట. ఎన్టీఆర్ కూడా ఈ స్టోరీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. జరుగుతున్న ప్రచారం నిజమై, ఒకవేళ ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ సిద్ధమైతే, తొలిసారి త్రివిక్రమ్ ప్యాన్ ఇండియాని టచ్ చేసినట్లవుతుంది. అన్నట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఎన్టీఆర్ ఆల్రెడీ టచ్ చేసేశాడు. రీసెంట్‌గా రిలీజైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీజర్‌లో ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ, అన్ని భాషల్లోనూ తన అద్భుతమైన వాయిస్‌ని పరిచయం చేసి, ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.