ఎక్స్‌పోజింగ్‌ చేస్తే అలా చూస్తారా?

మరిన్ని వార్తలు

సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తాం, అది సినిమా కోసం మాత్రమే. ఆ ఎక్స్‌పోజింగ్‌ రియల్‌ లైఫ్‌లో మా క్యారెక్టర్లను డిసైడ్‌ చెయ్యదని చెబుతుంది 'లోఫర్‌' బ్యూటీ దిశా పటానీ. మోడ్రన్‌గా ఉండటం కోసం రకరకాల దుస్తులు వేసుకుంటాం. అలాగని ఆ పేరుతో మహిళలపై వేధింపులకు దిగుతారా? మానవ మృగాలకి అదొక సాకు మాత్రమే. చీరకట్టుకుని తిరిగినా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సో అఘాయిత్యాలకు కారణం ఆడవాళ్లు వేసుకునే దుస్తుల్లో లేదు. చూసే మగవాళ్ల చూపుల్లోనే ఉంది. అందుకే మగవాళ్ళ మైండ్‌ సెట్‌లోనే మార్పు రావాలి అంటోంది ముద్దుగుమ్మ దిశాపటానీ. అయితే అందరు మగవాళ్లు చెడ్డవాళ్లని అనలేను కానీ, కొంతమంది వల్లనే ఈ సమస్య వస్తోంది అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎవరైనా ఇంకో మహిళపై అఘాయిత్యం చేసేముందు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉన్నారని ఆలోచించుకోవాలని కూడా సూచించింది ఈ హాట్‌ బ్యూటీ దిశా పటానీ. హీరోయిన్‌ భావనపై లైంగిక వేధింపుల్ని దిశా పటానీ ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు స్పందించారు. వారిలో రకుల్‌ కొంచెం ఘాటుగా స్పందిస్తే, అంతకు మరీ మసాలా దట్టించి మరికొంచెం ఘాటుగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ దిశాపటానీ. ఈ మధ్యే 'కుంగ్‌ఫూ యోగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ బ్యూటీ దిశాపటానీ. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS