టాలీవుడ్ నుంచి ఛాన్సులొస్తే ఈసారి వదులుకోనంటూ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో పొడుగు కాళ్ళ సుందరి దిశా పటానీ చెప్పింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు దిశా పటానీ పరిచయమైన విషయం విదితమే. అయితే, ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ తెలుగు తెరపై ఈ బ్యూటీ కన్పించలేదు. మళ్ళీ ఎందుకో, తెలుగు తెరపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. అలా ఫోకస్ పెట్టిందే తడవు, ఈ బ్యూటీకి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. అదీ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా కోసం.
ఇందులో ఓ స్పెషల్ సాంగ్ దిశా పటానీ చెయ్యబోతోందంటూ ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి ‘పుష్ప’ టీవ్‌ు నుంచి ఈ గాసిప్‌పై ఎలాంటి కామెంట్ రాకపోవడం గమనార్హం. మరోపక్క, దిశా పటానీ ఓ యంగ్ హీరో సరసన తెలుగులో నటించబోతోందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. హీరోయిన్‌గానే సినిమాలు చేయాలనే నియమ నిబంధనలేవీ పెట్టుకోలేదు దిశా పటానీ. బాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని స్పెషల్ సాంగ్స్ ఈ బ్యూటీ చేసేసింది. స్పెషల్ సాంగ్స్ విషయమై దిశా పటానీకి కొన్ని లెక్కలున్నాయి. వాటికి ఆమె పెర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది కూడా. అయితే, స్పెషల్ సాంగ్‌కి కూడా భారీగానే రెమ్యునరేషన్‌ని ఈ అమ్మడు డిమాండ్ చేస్తుందట.