రెడ్‌ హాట్‌ దిశా.. అందాల నిషా

By iQlikMovies - October 15, 2018 - 17:41 PM IST

మరిన్ని వార్తలు

బికినీలో కన్పించినా, ఇంకో వస్త్ర ధారణలో కన్పించినా అందాల భామ దిశా పటానీ రూటే సెపరేటు. పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా ఈ బ్యూటీని చెప్పుకోవచ్చు. స్విమ్మింగ్‌, డాన్సింగ్‌తో తన ఫిజిక్‌ని ఎప్పుడూ పెర్‌ఫెక్ట్‌గా వుంచుకుంటానని చెప్పే ఈ బ్యూటీ, వర్కవుట్స్‌ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపించదట. ఆహార నియమాల్లో చాలా జాగ్రత్తగా వుంటానంటోంది. నచ్చినవి తింటూనే, క్యాలరీస్‌కి తగ్గ వర్కవుట్స్‌ చేస్తూ ఫిజిక్‌ని ఫిట్‌గా వుంచుకుంటానని చెబుతోన్న దిశా పటానీ, ఫొటో సెషన్స్‌ కోసం ప్రత్యేకంగా వర్కవుట్స్‌ చేస్తానని వెల్లడించింది. అందుకేనేమో ఏ ఫొటో సెషన్‌లో అయినా దిశా పటానీ పెర్‌ఫెక్ట్‌గా కన్పిస్తుంటుంది. టూ పీస్‌ బికినీ వేసినా, ఇదిగో ఇలాంటి కాస్ట్యూమ్స్‌లో కనిపించినా దిశా లెక్కే వేరు. ఆమె అందం ఎవరికైనా నిషా ఎక్కించాల్సిందే. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ, తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌లో 'యోగా' తప్పకుండా వుంటుందని చెప్పింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS