బాంబు పేల్చేసింది. కుర్రాళ్ళ హృదయాలు హీటెక్కి పేలిపోయాయ్. ఈ ఫొటో చూస్తే ఎవరికైనా ఇలాంటి భావన కలగడం సహజమే. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ, ఇన్నర్ వేర్‌ని ప్రమోట్ చేయడం బహుశా దిశా పటానీకే చెల్లుతుందేమో. కొన్నాళ్ళ క్రితమే ఓ ఇన్నర్ వేర్ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన దిశా పటానీ, తనకు అది ఇష్టమైన బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే, అది ఓ టైపు హాట్ అప్పీల్ పండించింది. ఈసారి మాత్రం ఏకంగా 'బాంబులా' హాట్ అప్పీల్‌ని పేల్చేసింది. కాదేదీ అందానికి అనర్హం.. అనుకుందో ఏమో.! అవును మరి, అందాల విందుకు ఏ పండగ అయితేనేం.! తెలుగులో దిశా పటానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాలో నటించిన సంగతి తెల్సిందే.