బుల్లోడు బాలయ్య, బుల్లెమ్మ నిత్యామీనన్‌

By iQlikMovies - November 05, 2018 - 17:52 PM IST

మరిన్ని వార్తలు

అదేంటీ, బాలకృష్ణ 'పిండి' రుబ్బుతున్నాడు.? అనుకుంటున్నారా.! ఇది, 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' కోసం చిత్రీకరించిన ఓ సన్నివేశం. అవునూ, పక్కన నిలుచున్నదెవరు.? కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఫొటోలో వున్నది నిత్యా మీనన్‌ అని అర్థమవుతుంది. 'బుల్లోడు'గా బాలకృష్ణ, బుల్లెమ్మగా నిత్యామీనన్‌ నటిస్తున్నారన్నమాట. 

'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'కి సంబంధించి చిత్ర విచిత్రమైన సంగతుల్ని తెలుసుకుంటున్నాం మరి. శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంటే, బసవతారకం (స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి) పాత్రలో బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ నటిస్తోంది. నారా చంద్రబాబునాయుడి పాత్రలో దగ్గుబాటి రానా ఒదిగిపోయాడు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తోన్న సంగతి తెల్సిందే. 

ఇలా అతి ముఖ్యమైన పాత్రలతోపాటు, కాస్త ప్రాధాన్యమున్న పాత్రలకూ కాస్టింగ్‌ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యామీనన్‌ చాలా గొప్ప నటి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 'లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం..' అంటూ సాగే ఓ పాట కోసమే, ఎన్టీఆర్‌ - నిత్యా మీనన్‌ మీద ఈ షాట్‌ తీశారట. దీపావళి ధమాకా.. అంటూ ఈ స్టిల్‌ని విడుదల చేసింది 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' టీమ్‌. 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు' పేర్లతో ఈ బయోపిక్‌ని రెండు పార్టులుగా జనవరిలో విడుదల చేయనున్న సంగతి తెల్సిందే. 

ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారికంగా రావాల్సిన లుక్‌, విద్యాబాలన్‌దే. త్వరలోనే ఆ లుక్‌ కూడా రివీల్‌ చేయబోతున్నారట. ఈలోగా మరికొన్ని సర్‌ప్రైజింగ్‌ లుక్స్‌ రాబోతున్నాయని సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS