అందాల భామ దిశా పటానీ మరోసారి హాట్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేస్తోంది. టూ పీస్ బికినీ నుంచి, నడుమొంపుల్ని అందంగా ప్రదర్శించే ట్రెడిషనల్ సారీ వరకూ.. ఏ కాస్ట్యూమ్‌లో అయినా దిశా పటానీ గ్లామర్ కెవ్వు కేక అనాల్సిందే. పెర్‌ఫెక్ట్ ఫిగర్‌కి కేరాఫ్ అడ్రస్ అన్పించేలా వుండేందుకోసం నిత్యం కసరత్తులు చేస్తూనే వుండాలనీ, ముఖ్యంగా టూ పీస్ బికినీలో ఫొటోలకు పోజులు ఇవ్వాలంటే, దానికోసం చాలా కష్టపడాలనీ చెబుతుంటుంది దిశా పటానీ. అదీ నిజమే మరి. ఆ లుక్ కోసం అంత కష్టపడకపోతే, గ్లామర్‌లో తేడా వచ్చేస్తుంది. 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేస్తోంది. మళ్ళీ సరైన అవకాశమొస్తే, టాలీవుడ్‌లో కన్పిస్తానంటోంది ఈ బ్యూటీ. అన్నట్టు, ఫొటోలో దిశా పటానీ గ్లామర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. కాస్ట్యూమ్, లుక్, అమ్మడి ఫిజిక్.. ఒకటేంటీ, అన్నీ పక్కాగా సూట్ అయ్యాయి కాబట్టే, ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది మరి.