నటి దిశా పటానికి ఒక ఊహించని ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ తో ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్ళనుంది అన్న అభిప్రాయలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇంతకి ఆ ఆఫర్ ఏంటంటే- తమిళ దర్శకుడు సుందర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రంలో ప్రధాన పాత్రకి దిశాని ఎంపిక చేసారు. షూటింగ్ మొదలుకాకుండానే ఈ చిత్రం పైన ప్రేక్షకులకి భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు మొదలు హీరోయిన్ శృతి హసన్ ని టైటిల్ పాత్రకి ఎంచుకోగా తరువాతి రోజుల్లో ఆమె ఈ చిత్రం నుండి తప్పుకోవడం జరిగింది. దీనితో ఈ చిత్రం షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ తరుణంలో ప్రధాన పాత్రకి దిశా పటాని ని ఎంపిక చేయడంతో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.