దిశ దిశలా అందమే అంటే అది దిశాపటానీనే. డిఫరెంట్ ఫోటో సెషన్స్‌కి పెట్టింది పేరు దిశా పటానీ. అందాన్ని హాయిగా ఆస్వాదించే వారికి దిశా పటానీ గ్లామర్ మరింత ఆహ్లాదాన్నిస్తుంది. ఇక కుర్రకారు అయితే దిశాపటానీ గ్లామర్ పిక్స్ కోసం ఎప్పటికప్పుడే కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు.
కంటి మీద కునుకు లేకుండా మతులు పోగొట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు. చూస్తున్నారుగా ఈ పిక్ చూస్తుంటే దిశాపటానీ క్రియేటివిటీ ఏ పాటిదో అర్ధమవుతుంది. లొకేషన్‌కి మ్యాచ్ అయ్యేలా వేసిన ఆమె కాస్ట్యూమ్ ఆమె లొకేషన్‌తో ఆమె అందం పోటీపడేలా చేస్తోంది.
టాలీవుడ్లో 'లోఫర్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా గడుపుతోంది. హృతిక్ రోషన్, సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోలతో ప్రెస్టీజియస్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటేందుకు సిద్దంగా ఉంది హాట్ హాట్ దిశాపటానీ.