కరోనా కారణంగా ప్రపంచమే మారిపోయిందట. హాట్ బ్యూటీ దిశా పటానీ చెబుతోందిది. కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమంతా లాక్‌డౌన్ మోడ్‌లోకి వెళ్ళిపోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి పర్యావరణానికి సంబంధించి మన దేశంలో తీసుకుంటే కాలుష్యం విపరీతంగా తగ్గిపోయింది. ఇవన్నీ ఆహ్వానించదగ్గ మార్పులే. ‘ఈ మార్పులు చూస్తోంటే చాలా ఆనందంగా వుంది. మనం ఈ భూమ్మీదకి అతిథులుగానే వచ్చాం.. భూమిని నాశనం చేయకుండా మన తదుపరి తరాలకు ఆ వనరుల్ని ఇవ్వడం మన బాధ్యత..’ అని చెబుతోంది దిశా పటానీ.
‘ప్రపంచం మునుపటిలా ఖచ్చితంగా వుండదు. అదెలా మారుతుందో ఇdప్పుడే చెప్పలేం. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే ఆ పరిస్థితులపై కాస్త స్పష్టత రావొచ్చు..’ అని దిశా పటానీ చెప్పుకొచ్చింది. సినిమాల్ని జనం అంత తేలిగ్గా మర్చిపోలేరనీ, సినిమా తిరిగి పూర్వ వైభవం సంపాదిస్తుందనీ దిశా పటానీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెగ్యులర్ వర్కవుట్స్‌తో తన లైఫ్ ప్రారంభమయి, అనేక రకాలైన కొత్త విషయాలతో రోజంతా గడిచిపోతోందనీ, అయితే అదంతా నాలుగ్గోడల మధ్యనే జరగుతోందని దిశా పటానీ చెప్పింది.