హీరోయిన్ సోనాల్ చౌహన్ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అయితే, ఆశించిన స్టార్‌డమ్ ఇంకా రాలేదనుకోండి.. అది వేరే విషయం. బాలకృష్ణతోనే ఆమె ఎక్కువ సినిమాలు చేయడం గమనార్హం. ఇక, రామ్ సరసన ఆమె చేసిన ‘పండగ చేస్కో’తోపాటు, అనుష్క - ఆర్య కాంబినేషన్‌లో రూపొందిన ‘సైజ్ జీరో’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అసలు విషయానికొస్తే, సోనాల్ చౌహన్ ప్రస్తుతం క్వారంటీన్ లైఫ్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేసేస్తోందట. ఇదివరకెప్పుడూ తన ఇంట్లో పనులు తాను చేయలేదనీ, కరోనా కారణంగా ఆ పనుల విలువ, అవసరం ఏమిటో తెలిసొచ్చిందనీ అంటోంది సోనాల్ చౌహన్.
పొద్దున్నే లేవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత వర్కవుట్స్, వంట చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ సక్రమంగా చేస్తోంటే, ఏదో తెలియని కొత్త శక్తి, ఆనందం కలిగినట్లు అనిపిస్తున్నాయని చెప్పిందీ బ్యూటీ. ఓ వెబ్ సిరీస్‌కి ఇటీవలే తాను సైన్ చేయడం జరిగిందనీ, రిహార్సల్స్ చేస్తున్న సమయంలోనే లాక్‌డౌన్ వచ్చిందనీ, దాంతో రెగ్యులర్ షూట్‌కి వెళ్ళలేకపోయామనీ, అదెప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి వచ్చిందని వాపోయింది సోనాల్ చౌహన్. ఈ క్వారంటీన్ లైఫ్‌లో చాలా నేర్చుకుందట ఈ ముద్దుగుమ్మ. క్రమశిక్షణ, ప్రకృతిని ప్రేమించడం.. ఇలా చాలా విషయాలపై అవగాహన పెంచుకుందట సోనాల్ చౌహన్.