గ్లామ్‌ షాట్‌: నీ సోకు బంగారం కానూ!

మరిన్ని వార్తలు

బంగారు మేని ఛాయ.. అని అంటుంటాం కదా.! ఆ మేని ఛాయకి పెర్‌ఫెక్ట్‌ అడ్రస్‌ ఇదిగో తానేనంటోంది 'లోఫర్‌' బ్యూటీ దిశా పటానీ. ఈ మధ్య ఎందుకో ఓవర్‌ డోస్‌ గ్లామర్‌తో కుర్రకారుకి సవాళ్ళ మీద సవాళ్ళు విసిరేస్తోంది.. ఈ గ్లామర్‌ని తట్టుకోగలరా.? లేదా.? అన్నట్టుగా. ఇదిగో, లేటెస్ట్‌గా దిశా పటానీ ఇంత హాట్‌గా దర్శనమిచ్చాక ఆమె బంగారు సొగసుకి ఫిదా అవకుండా వుండగలరా ఎవరైనా! ఛాన్సే లేదు.

ఫిట్‌నెస్‌ విషయంలో అందరికన్నా ముందుండే దిశా పటానీ, అందాల విందులోనూ అంతే. ఈ మధ్యనే ఓ లోదుస్తుల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాక, ఆ లో దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చేసి టెంపరేచర్‌ పెంచేసిన దిశ, ఇప్పుడిలా ఓ ఈవెంట్‌ కోసం ఇంత హాట్‌గా తయారైంది. చక్కనమ్మ ఏం చేసినా అందమే! అందుకే మరి, అందరూ 'నీ సోకు బంగారం కానూ' అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS