కమల్‌ ఆ సినిమాని పూర్తిగా వదిలేసినట్లేనా.?

మరిన్ని వార్తలు

కమల్‌హాసన్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శభాష్‌ నాయుడు'. కమల్‌ తనయ శృతిహాసన్‌ కూడా నటిస్తున్నారు ఈ సినిమాలో. అయితే ఎప్పటి నుండో సెట్స్‌ మీదే ఉంది ఈ సినిమా. ఈ సినిమా గురించి పెద్దగా బయటికి వచ్చిన అప్‌డేట్స్‌ కూడా ఏమీ లేవు. కమల్‌, శృతిహాసన్‌ రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌నే పోషిస్తున్నారు అనే అంశం తప్ప ఈ సినిమా కథా, కమామిషు కూడా ఏమీ తెలీవు. అయితే ప్రస్తుతం ఈ సినిమాని కమల్‌ పక్కన పెట్టేశారనీ తెలుస్తోంది.

ఎందుకంటే కమల్‌ ప్రస్తుతం 'ఇండియన్‌ 2' సినిమా కోసం సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శంకర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. టాలీవుడ్‌ భామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతోంది. ఇవన్నీ 'ఇండియన్‌ 2' సంగతులు. అయితే కమల్‌ - శృతిహాసన్‌ కాంబో మూవీ 'శభాష్‌ నాయుడు' అటకెక్కేసినట్లే అనిపిస్తోంది. ఈ సినిమా స్టార్టింగ్‌ నుండీ ఏవో అవాంతరాలు ఎదురవుతూనే వచ్చాయి.

ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఓ యాక్సిడెంట్‌ కారణంగా కొన్ని నెలలు కమల్‌హాసన్‌ బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఈ సినిమాని పక్కన పెట్టేశారు కమల్‌ హాసన్‌. ఇదిలా ఉంటే, 'ఇండియన్‌ 2' తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేకిచ్చేసి, పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్‌ పెడతానని ఇటీవల కమల్‌ క్లారిటీ ఇచ్చినట్లుగానూ సమాచారమ్‌ ఉంది. సో ఇవన్నీ పరిగణలోనికి తీసుకుంటే 'శభాష్‌ నాయుడు' సినిమాకి పూర్తిగా టాటా బైబై చెప్పేసినట్లేనేమోననిపిస్తోంది.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS