లాంగ్‌ లెగ్స్‌ హాట్‌ లుక్స్‌

By iQlikMovies - June 25, 2018 - 16:33 PM IST

మరిన్ని వార్తలు

పొడుగు కాళ్ల సుందరి దిశాపటానీ ఏం చేసినా హాట్‌ అప్పీల్‌ మాత్రం అస్సలు మిస్‌ కాదు. అందుకే ఈమెకి అవకాశాలతో పని లేకుండా, సోషల్‌ మీడియాలో అభిమానులు పోటెత్తుతుంటారు. 

ఈ ఫోటో విషయానికి వస్తే, గ్రీన్‌ కలర్‌ పొట్టి కాస్ట్యూమ్‌లో దిశా పటానీ అంద చందాలకు, కైపెక్కించే చూపులకు కుర్రకారు ఫిదా అయిపోతోంది. ఆ మాటకొస్తే దిశాపటానీ ఏ కాస్ట్యూమ్‌లో కనిపించినా అంతే. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతకు ఆఫర్లు వస్తాయనడానికి దిశా పటానీ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో దూస్కెళ్లిపోతోంది. ఇటు సౌత్‌లో ప్రెస్టిజియస్‌ మూవీస్‌తో పాటు, బాలీవుడ్‌లో సల్మాన్‌, హృతిక్‌ వంటి స్టార్‌ హీరోలతోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 

సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత అనేది తనకు ఓ హాబీ అంటోంది దిశా పటానీ. సినిమాలతో తీరిక ఉన్నా, లేకున్నా సోషల్‌ మీడియాని మాత్రం ఎప్పటికప్పుడే తన హాట్‌నెస్‌తో నింపేస్తానని ఫ్యాన్స్‌కి భరోసా ఇస్తోందీ బ్యూటీ. అంత హాట్‌ ఆఫర్‌ ఈ క్యూట్‌ బ్యూటీ నుండి వస్తే, ఫ్యాన్స్‌కి కూడా అంతకు మించి కావాల్సిందేముంటుంది చెప్పండి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS