తననెవరూ పట్టించుకోవడంలేదన్న సంగతి శ్రీరెడ్డికి బాగా తెలుసు. అందుకే సోషల్ మీడియాలో సంచలన పోస్టింగ్స్‌తో మీడియా అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకుంటోంది. మొదట్లో విపరీతమైన హైప్ ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా శ్రీరెడ్డిని లైట్ తీసుకోవడానికి కారణమూ లేకపోలేదు.
ఎందుకంటే శ్రీరెడ్డికి తన మాట మీద అదుపు వుండదు. బూతులు తిట్టేస్తుంటుంది. అలా బూతులు తిట్టేసి ఛానళ్ళ పరువు తీసేస్తోంది శ్రీరెడ్డి అనే విమర్శ వుంది. న్యూస్ ఛానళ్ళ ఇజ్జత్ పోతోందంటూ మీడియా పీపుల్ కొందరు ఆవేదన వ్యక్తం చేశారట. దాంతో మీడియా ఛానల్స్ శ్రీరెడ్డిని లైట్ తీసుకుంటున్నాయి.
ఎక్కడో అమెరికాలో సెక్స్ రాకెట్ వెలుగు చూస్తే, ఆ ఘనత తనదేననీ, సినీ పరిశ్రమ తాట తీస్తాననేంతలా శ్రీరెడ్డి చెలరేగిపోతోంది. సోషల్ మీడియాలో ఏం రాసినా చెల్లిపోతుందన్నట్లుగా పలువురు ప్రముఖ హీరోయిన్ల ఫోటోలు, యాంకర్ల ఫొటోలు పెట్టేసి ఆ సెక్స్ రాకెట్‌తో వారికి సంబంధం వుందనే అర్థం వచ్చేలా లీడ్ ఇస్తోన్న శ్రీరెడ్డి పట్ల చాలామంది గుస్సా అవుతున్నారు.
అయితే అనవసరంగా శ్రీరెడ్డిని కెలికి తమ పరువుని బజారుకీడ్చేసుకోవడమెందుకు అని వారంతా ఆలోచిస్తున్నారు. అలా వారు ఆలోచిస్తోంటే, శ్రీరెడ్డి మాత్రం ఎవరో ఒకరు తన మీద నోరు పారేసుకోవాలని చూస్తోంది. ఎవరన్నా నోరు పారేసుకుంటే, ఆ తర్వాత శ్రీరెడ్డి చెలరేగిపోయే తీరు ఇంకోలా వుంటుంది.