‘నువ్వు హీరోయిన్ మెటీరియల్..’ అంటూ బిగ్‌హౌస్‌ని వదిలి వెళ్ళేటప్పుడు టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ దేవి నాగవల్లి చెప్పింది. ఈ సీజన్ బిగ్‌హౌస్‌లో హీరోయిన్ మోనాల్ గజ్జర్ వున్నా, ‘హీరోయిన్ మెటీరియల్’ అన్న గుర్తింపు మాత్రం దివికే దక్కింది. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. అని చాలామంది దివి గురించి అనుకున్నా, ఆ స్థాయిలో ఆమె హౌస్‌లో సత్తా చాటలేకపోయింది. అయితే, ఆమెకంటే డల్‌గా హౌస్‌లో కొనసాగుతున్నవారిని వుంచేసి, దివిని పంపేయడం పట్ల విమర్శలు వెల్తువెత్తుతున్నాయనుకోండి. అది వేరే సంగతి.
దివి, హౌస్ నుంచి వెళ్ళే సమయంలో, హీరో కార్తికేయను ఉద్దేశించి సమంత ‘దివికి మీ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి’ అని కోరింది. ఏదో జస్ట్ అలా అనాలి కాబట్టి సమంత అలా అనేసిందా.? లేదంటే, దివి పట్ల బిగ్‌బాస్ నిర్వాహకులకే అంత ప్రత్యేక ఆసక్తి వుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ చాలామంది బిగ్‌హౌస్ వేదికగా నాగార్జునని చాలా కోరికలు కోరారు. వాటిల్లో సినిమా ఛాన్సులే ఎక్కువ. అంటే, కంటెస్టెంట్స్‌ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం చేసుకోవచ్చు. దివి అంటే ‘మహర్షి’ సినిమాలో మహేష్ పక్కన ఓ చిన్న రోల్‌లో కనిపించిన భామ గుర్తుకొస్తుంది. ఆ తర్వాత బిగ్‌హౌస్‌తోనే ఆమెకు పాపులారిటీ వచ్చింది. మరి, ‘బిగ్‌బాస్’ తర్వాత దివి హీరోయిన్ అయిపోతుందా? అక్కినేని ఫ్యామిలీ తలచుకుంటే మాత్రం అయిపోవచ్చు. కాగా, ‘బ్రింగ్ బ్యాక్ దివి’ అంటూ దివి అభిమానులు ఇంకా అర్థం పర్థం లేని యాగీ సోషల్ మీడియాలో చేస్తూనే వున్నారు.