టాలీవుడ్ లో ఊహించని ఓ కాంబినేషన్ సెట్టయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందబోతోంది. అన్నీ కుదిరితే.. అతి త్వరలో ఈ కాంబినేషన్ ని అధికారికంగా ప్రకటించేస్తారు. అల వైకుంఠపురములో తరవాత... ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కానీ `ఆర్.ఆర్.ఆర్`లో పడిపోయిన త్రివిక్రమ్.. అందులోంచి బయటకు రాలేకపోయాడు.
2021 వేసవికి గానీ, ఎన్టీఆర్ కాల్షీట్లు దొరికే అవకాశం లేదు. అందుకే... ఈలోగా ఓ సినిమా చేయాలన్నది త్రివిక్రమ్ ప్రయత్నం. అందుకోసం వెంకటేష్, మహేష్‌బాబు, నాని.. ఇలా చాలామంది పేర్లని పరిశీలించాడు త్రివిక్రమ్.వాళ్ల చేతిలో ఉన్న ప్రాజెక్టులూ, కాల్షీట్లూ అన్నీ చెక్ చేసుకున్నాక.. చివరికి రామ్ తో ఫిక్సయినట్టు టాక్. రామ్ చేతిలో `రెడ్` ఉంది. ఆ తరవాత.. ఏ సినిమాకీ కమిట్ కాలేదు. అందుకే రామ్ తో ఈ సినిమా ఫైనల్ అయిందని వార్తలొస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాపై ఓ క్లారిటీ రావొచ్చు.