తెలుగులో చిన్న సినిమాగా విడుదలై... భారీ విజయాన్ని సాధించింది డీజే టిల్లు. ఈ సినిమాతోనే సిద్దూ జొన్నల గడ్డ... యూత్ హీరోల్లో తనకంటూ కొంత క్రేజ్ సంపాదించుకొన్నాడు. ఇప్పుడు డీజే టిల్లు 2 కూడా రెడీ అవుతోంది. ఈలోగా.. ఈ సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం... ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని సంప్రదించింది. డీల్ కూడా దాదాపుగా క్లోజ్ అయినట్టే. అయితే బాలీవుడ్ రీమేక్‌లో హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ టాప్ రేంజులో దూసుకుపోతున్న ఓ యంగ్ హీరోని ఎంచుకొనే ఛాన్స్ ఉంది.
అయితే డీజే టిల్లులో గొప్ప కథంటూ ఉండదు. హీరో క్యారెక్టరైజేషన్, దాంతో పాటు... హీరో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్లస్ అయ్యాయి. సిద్దుని తప్ప ఆ పాత్ర లో ఇంకెవ్వరినీ ఊహించలేం. సిద్దూని రీ ప్లేస్ చేయడం అంటే మాటలు కాదు. రణవీర్ సింగ్ లాంటి హీరో దొరికితే.. డీజే టిల్లు బాలీవుడ్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి... డీజే టిల్లుగా మోత మోగించే ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.