ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్2’ . జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబధించిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.,. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో భాగమయ్యారు. . 'అవతార్-2- ది వే ఆఫ్ వాటర్' తెలుగు వెర్షన్‌కి డైలాగ్స్ రాశారు అవసరాల. ఆయన మంచి రైటర్ కూడా. ఆయన డైలాగ్స్ క్యాచిగా వుంటాయి. ఇప్పుడు అవతార్ 2 తెలుగు వెర్షన్ అవసరాల మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకుల ముందు వస్తోంది.
ఇక ‘‘అవతార్2’కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 3డీ ఐమ్యాక్స్, 4డీ అనుభూతి కలిగిన థియేటర్‌లలో సినిమా చూడాలంటే దాదాపు రూ.1000పైనే టికెట్ ధర ఉండటం గమనార్హం. మరోవైపు మొత్తం అవతార్ సినిమా ప్రీసేల్ బుకింగ్స్ రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.