పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ మీదికెళ్లగా, మరో మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో హరీష్ శంకర్ కన్‌ఫామ్ అయిపోయాడు. ఇక తాజాగా వార్తల్లోకి వచ్చిన డాలీ పేరు కూడా దాదాపు కన్‌ఫామ్ అయ్యిందనే అంటున్నారు. ఈ మధ్య డాలీ, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కథా చర్చల్లో భాగంగానే ఈ మీటింగ్ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డాలీ వినిపించిన కథ పవన్‌కి చాలా బాగా నచ్చేసిందట.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ అనీ తెలుస్తోంది. స్టోరీ లైన్‌లోనే పవర్ స్టార్‌కి పవర్ చూపించేసిన డాలీ, ఇక ఫుల్ స్క్రిప్టు కూడా ఎలా ఉండబోతోందో శాంపిల్‌గా వివరించేశాడట. దాంతో, డాలీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ టాక్. సో పవన్ లిస్టులో చేరిపోయిన డైరెక్టర్స్‌లో డాలీ కూడా ఉన్నాడని తెలుస్తోంది. గతంలో డాలీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘గోపాలా గోపాలా’, ‘కాటమరాయుడు’ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. జరుగుతోన్న ప్రచారం నిజమై, తాజా ప్రాజెక్ట్ ఓకే అయితే, ఈ కాంబో ముచ్చటగా మూడోసారి పట్టాలెక్కబోతోందన్న మాట.