'డాన్‌ బాస్కో'లో ఇల్లీబేబ్‌ అదరహో!

మరిన్ని వార్తలు

'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాకి సంబంధించి 'డాన్‌ బాస్కో' అంటూ సాగే సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుదలయ్యింది. 'వావ్‌ ఇలియానా..' అన్పించేలా, ఇలియానా ఈ పాటలో తన గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే, ఈ సాంగ్‌ రిలీజ్‌కి ముందు 'ఈ సినిమాలో గ్లామర్‌ అస్సలేమాత్రం వుండదట.. ఇలియానాకి అసలు ప్రాధాన్యతే వుండదట..' అంటూ గాసిప్స్‌ చక్కర్లు కొట్టాయి. 

కానీ, 'డాన్‌ బాస్కో' లిరికల్‌ సాంగ్‌తో ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. చాన్నాళ్ళ తర్వాత తెలుగు తెరపై కన్పించబోతోన్న ఇలియానా, 'డాన్‌ బాస్కో' సాంగ్‌తో కెవ్వు కేక అన్పించేసింది. సాయంత్రం ఇదే సాంగ్‌ వీడియో ప్రోమో విడుదల కాబోతోంది. ఉదయం విడుదలైన లిరికల్‌ వీడియోలో, సాంగ్‌ మేకింగ్‌ కూడా కొంత మేర చూపించడం గమనార్హం. మాస్‌ మహరాజా రవితేజ ఈ పాట కోసం అదరహో అన్పించేలా మంచి డాన్సులు వేసినట్లే కన్పిస్తోంది. 

భారీ సెట్‌లో ఈ సాంగ్‌ని చిత్రీకరించారు. షూటింగ్‌ సందర్భంగా రవితేజ కుమారుడు కూడా సందడి చేశాడండోయ్‌. 'రాజా ది గ్రేట్‌' సినిమాలో రవితేజ కుమారుడు కూడా నటించిన సంగతి తెల్సిందే. ఇంతకీ, 'డాన్‌ బాస్కో' సాంగ్‌ చూడ్డానికి మాత్రమే రవితేజ కొడుకు వచ్చాడా? ఆ సాంగ్‌లో అతను కూడా కన్పిస్తాడా? 

ఏమోగానీ, ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో మాత్రం కంప్లీట్‌గా ఇలియానాని ఎక్స్‌పోజ్‌ చేయడానికే అన్నట్లుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ఇలియినా ఈ పాటలో చాలా బొద్దుగా కన్పిస్తోంది. అయితేనేం, ఆమె స్టయిలిష్‌ లుక్‌ సినిమాకి అదనపు ఆకర్షణ కానుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS