యంగ్‌ టైగర్‌ 'ఎన్టీఆర్‌' రాక తప్పదేమో!

మరిన్ని వార్తలు

అబ్బే, మా సినిమా కోసం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని సంప్రదించలేదు.. అని దర్శకుడు క్రిష్‌ చెప్పేసినా, ఇంకా 'ఎన్‌టీఆర్‌' బయోపిక్‌లో యంగ్‌ టైగర్‌ గురించి గాసిప్స్‌ విన్పిస్తూనే వున్నాయి. 

తాజా గాసిప్స్‌ సారాంశమేంటంటే, బాబాయ్‌ బాలకృష్ణ స్వయంగా ఎన్టీఆర్‌తో మాట్లాడాడనీ, సినిమాలో ఓ ముఖ్యమైన సన్నివేశంలో కన్పించాలని రిక్వెస్ట్‌ చేశాడనీ, బాబాయ్‌ స్వయంగా తనను అడగడంతో ఎన్టీఆర్‌ ఒప్పుకోవాల్సి వచ్చిందనీ, త్వరలోనే ఆ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారనీ. ఆ సన్నివేశం సినిమాలో అత్యంత కీలకమైన సందర్భంలో వస్తుందట. ఇంత షడెన్‌గా ఈ నిర్ణయం బాలయ్య అండ్‌ టీమ్‌ ఎందుకు తీసుకుందో మాత్రం తెలియరాలేదు. 

అయితే, క్రిష్‌ సూచన మేరకే, బాలయ్య - ఎన్టీఆర్‌తో మాట్లాడాడని తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, కళ్యాణ్‌రామ్‌ ఇప్పటికే ఈ సినిమాలో నటించేస్తోన్న సంగతి తెల్సిందే. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.. తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో.. కొడుకుగా తన పాత్రలో. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్నాడు. మరి, యంగ్‌ టైగర్‌ రోల్‌ ఏంటి? అనేది సస్పెన్స్‌. 

ఇదిలా వుంటే, ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌రామ్‌ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అదెంత నిజమో మాత్రం తెలియరావడంలేదు. జనవరిలో 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' రెండు పార్టులూ విడుదల కావాల్సి వుండగా, సెకెండ్‌ పార్ట్‌ కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS