పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ కోవిడ్ కారణంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని.. చిత్రసీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చిరంజీవి తక్షణ సహాయంగా రూ.1 లక్ష అందించారు. ఆ స్ఫూర్తితో.. చిత్రసీమలో కొంతమంది టీఎన్నార్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టెన్‌మెంట్స్ సంస్థ రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందించింది.
`కలర్ ఫొటో` నిర్మాతల నుంచి పాతిక వేల సహాయం అందింది. టీఎన్నార్ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని చాలామంది.. తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. టీఎన్నార్ సతీమణి బ్యాంక్ ఎకౌంట్ డిటైల్స్ సోషల్ మీడియాలో సర్క్యూట్ అవుతోంది. దాతలు తమకు తోచిన సహాయాన్ని గూగుల్ పే ద్వారా అందిస్తున్నారు.