ధీరుడు రాజమౌళి తప్పు చేస్తున్నాడట. హీరో కార్తిని పక్కన పెట్టేసి ఎవరెవర్నో హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్నాడట. రాజమౌళికి న్యాయం లేదంటున్నాడు.. బాబోయ్ ఇవన్నీ మేం అంటున్న మాటలు కాదండోయ్. స్వయంగా మన ఖైదీ అదేనండీ, కార్తీ అంటున్న మాటలే. అయితే, రియల్ డైలాగులు కాదులెండి, రీల్ డైలాగులివి. కార్తి నటిస్తున్న తాజా చిత్రం 'దొంగ' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ ట్రైలర్‌లో కార్తి కామెడీ డైలాగులు, ఎమోషనల్ టచ్చింగ్ సీన్లు అభిమానుల్ని అలరిస్తున్నాయి.
కార్తికి రియల్ లైఫ్ వదిన అయిన జ్యోతిక, రీల్ లైఫ్ అక్కగా నటిస్తున్న సినిమా ఇది. అక్కా, తమ్ముళ్ల ఎమోషనల్ డ్రామాగా 'దొంగ' రూపొందింది. తమిళంలో 'తంబీ' టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాని హర్షిత మూవీస్ అధినేత రావూరి. వి.శ్రీనివాస్ తెలుగులో అందిస్తున్నారు. ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్ హార్ట్ టచ్చింగ్‌గా అనిపిస్తోంది. అక్క ఇద్దరు అమ్మలతో సమానం.. అనే డైలాగ్ కార్తీ ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పడం ట్రైలర్‌కి చాలా వెయిట్ ఇస్తోంది. ఇటీవల హీరోయిన్ లేకుండా, ఎలాంటి కమర్షియల్ హంగులూ, ఆర్భాటాల్లేకుండా 'ఖైదీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి, సూపర్ హిట్ అందుకున్న కార్తి, 'దొంగ'లా ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలిక.