'తలైవర్‌ 168' నేడే ప్రారంభం.!

మరిన్ని వార్తలు

హిట్‌ చిత్రాల దర్శకుడు శివ ఈ సారి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో మాస్‌ కమర్షియల్‌ బేస్డ్‌ మూవీని తెరకెక్కించనున్నాడు. అజిత్‌తో 'వీరమ్‌', 'వివేగం', 'విశ్వాసం' వంటి వరుస హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శివ ఇప్పుడు సూపర్‌ స్టార్‌తో తెరకెక్కించబోయే చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా ఓపెనింగ్‌కి టాలీవుడ్‌ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారట. ఈ సినిమాలో తలైవికి జోడీగా ఖుష్బూ, కీర్తి సురేష్‌ నటించనున్నారు. అలనాటి అందాల భామ మీనా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

 

ప్రకాష్‌ రాజ్‌, సూరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ఈ రోజు నుండే స్టార్ట్‌ కానుంది. హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ పూర్తి చేయనున్నారట. కీర్తి సురేష్‌, రజనీకాంత్‌పై తొలి సన్నివేశాలు చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారనీ సమాచారం. తదుపరి షెడ్యూల్‌ కోసం చెన్నైలో ఓ భారీ సెట్‌ని రూపొందించారట. అజిత్‌ - శివ కాంబినేషన్‌ మూవీస్‌కి తెలుగు ప్రేక్షకుల నుండి కూడా అపారమైన ఆదరణ దక్కింది. దాంతో ఆయన, రజనీతో తెరకెక్కించబోయే మూవీ అంటే, అభిమానుల్లో అప్పుడే క్యూరియాసిటీ నెలకొంది. చూడాలి మరి, అజిత్‌కి సూపర్‌ హిట్స్‌ ఇచ్చినట్లే, సూపర్‌ స్టార్‌తో శివ మరోసారి ఓ మంచి హిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS