అనుష్క సరే, కోహ్లీ కూడా ఉన్నాడా.?

మరిన్ని వార్తలు

మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారు ఈ ప్రపంచంలో అని మన పెద్దలు చెప్పగా విన్నాం. వినడమే కాదు, ఈ మధ్య అక్కడక్కడా చూసేస్తున్నాం కూడా. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ని పోలిన స్నేహా ఉల్లాల్‌ని చూశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబును పోలిన మనిషి ఓ కాకా హోటల్‌లో పని చేస్తున్న వీడియోలు చూశాం. ఇలా ఒక్కరేంటీ. నిజమా కాదా.? అనే విషయం పక్కన పెడితే ఇలాంటి అద్భుతాలైతే చూసేశాం.

 

వివరాల్లోకి వెళితే, తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ ఇప్పుడు అచ్చం తనలాగే ఉన్న ఇంకో ఐదుగురిని వెతికే పనిలో ఉంది. ఎందుకంటారా.? తనతో కలిపి పెద్దలు చెప్పిన ఆ ఏడుగురిలో ఒకర్ని కనుగొంది మరి. ఇక మిగిలింది ఐదుగురే కదా. అదీ సంగతి. జూలియా మిచెల్స్‌ అనే అమ్మాయి అచ్చం అనుష్కలానే కనిపిస్తోంది. ఆమెని చూసి అనుష్క మురిసిపోయింది. 'అచ్చం నాలాగే ఉన్నావ్‌' అని చెబుతూ నేనిప్పుడు ఇంకో ఐదుగురి కోసం వెతకాలి అని సరదాగా కామెంట్‌ చేసింది. 

 

ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిజానికి ఈ ఫోటోల్లోని ఓ గెటప్‌లో మాత్రమే మిచెల్‌, అనుష్కా ఒకలా ఉన్నారంతే. మిగతా ఫోటోల్లో ఈ ఇద్దరికీ పోలికల్లేవ్‌. ఇదిలా ఉంటే, 'ఇడిగో ఇంకో కోహ్లీ..' అంటూ పలువురు అనుష్కకు సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. ఏంటి నిజంగానే కోహ్లీని పోలిన మరో కోహ్లీ ఉన్నాడా.? ఇది సోషల్‌ మీడియా మాయాజాలమా.? 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS