స‌ల్మాన్ సూప‌ర్ హిట్ లో... గోపీచంద్‌

By iQlikMovies - February 06, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ట‌యిన‌ ‘టైగర్‌ జిందా హై’ తెలుగు రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. స‌ల్మాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. 2017లో వ‌చ్చిన ఈ చిత్రం దాదాపు 500 కోట్లు సాధించింది. రెండేళ్ల త‌ర‌వాత ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని గోపీచంద్‌తో తెలుగులో తెర‌కెక్కించాల‌ని ఓ నిర్మాత గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. 

 

క‌థానాయిక‌గా త‌మ‌న్నాని ఎంచుకునే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. గోపీచంద్ - త‌మ‌న్నా క‌ల‌సి న‌టించ‌డం ఇదే తొలిసారి అవుతుంది. గోపీచంద్ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయితే వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇటీవ‌లే తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ఇప్పుడు ఈ రీమేక్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది. తిరు సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ రీమేక్ ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS