చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తున్నారే!

మరిన్ని వార్తలు

ఈ నెల 12న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండూ డిఫరెంట్‌ జోనర్‌ మూవీసే. ఒకటి లవ్‌ స్టోరీ 'దొరసాని' కాగా, ఇంకోటి డిఫరెంట్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ అయిన 'నిను వీడని నీడను నేనే'. 'నీడ' సంగతి అటుంచితే, 'దొరసాని' గురించి మాట్లాడుకుందాం. లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి 'కప్పతల్లి..' అనే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌లో బంగ్లా కిటికీలోంచి కిందికి చూస్తున్న అందమైన దొరసాని, కింద కూలి వాడైనా రొమాంటిక్‌ చూపులున్న మాంచి వయసున్న కుర్రోడు.

 

ఈ ఇద్దరి మధ్యా చూపుల బాణాలే ఈ లిరికల్‌ వీడియోలో చూపించారు. ఈ చూపుల బాణాలకు వారే కాదు, చూస్తున్న ప్రతీ కుర్రోడు, కుర్రదీ కూడా తెగ ఫీలయిపోతున్నారు. వారి మధ్య ప్రేమ చిగురులు తొడిగింది. కానీ, ఈ చూపులకు బయటి కుర్రజనం పరిస్థితేంటీ.? ఇలాంటివి చాలానే చూసేశాం.. అంటారా.? ప్రేమకు కొత్తా, పాతా ఉండదు. ఎప్పటికప్పుడే కొత్త కొత్తగా సరికొత్తగా పుట్టుకొస్తుంటుంది. ప్రస్తుతానికి 'దొరసాని' ప్రోమోలు ఆ ప్రేమ జల్లుకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఆర్‌. మహేంద్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాత్మిక, ఆనంద్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ALSO SEE : Dorasani Trailer

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS