చందమామకేం తక్కువ.. అందుకు అర్హురాలేగా!

By iQlikMovies - July 04, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా, నటీనటులు అక్కడి నుండి, ఇక్కడికీ, ఇక్కడి నుండి అక్కడికీ అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నారు. ఆ దూరం కాస్తా, హాలీవుడ్‌ దాకా చేరిపోయింది. హాలీవుడ్‌లోనూ మన నార్త్‌ స్టార్లు ఇప్పటికే సత్తా చాటుతున్నారు. అంతెందుకు మొన్న ఓ హాలీవుడ్‌ నటుడు మన సూపర్‌స్టార్‌ మహేష్‌తో, డైరెక్టర్‌ మురుగదాస్‌తో కలిసి స్పై థ్రిల్లర్‌ ప్లాన్‌ చేద్దాం అని సంకేతాలు పంపించలా.. ఇక ఇప్పటికే బాలీవుడ్‌ నుండి ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె తదితరులు హాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు.

 

కొంతమంది సౌత్‌ స్టార్స్‌కి ఆ అవకాశం దక్కింది. ఆల్రెడీ శృతిహాసన్‌ ఓ వెబ్‌ సిరీస్‌తో త్వరలో హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. అనుష్క నటిస్తున్న 'సైలెన్స్‌' కూడా ఇంగ్లీష్‌లో విడుదల కానుందట. ఇక ఇప్పుడు చందమామ కాజల్‌ వంతొచ్చింది. ఈ మధ్య 'హాలీవుడ్‌కెళ్తున్న కాజల్‌' అంటూ వార్తలు తెగ గుప్పుమంటున్నాయి. నిప్పుంటేనే కదా.. ఎంతో కొంత పొగ రాజయ్యేది. సో ఆ నిప్పు నిజమే అనిపిస్తోంది.

 

త్వరలో కాజల్‌ హాలీవుడ్‌లో అడుగు పెట్టడం ఖాయమే అనిపిస్తోంది. ఓ హాలీవుడ్‌ దర్శకుడు కాజల్‌తో బైలింగ్వల్‌ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నాడట. ఆంగ్ల, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందట. ఏరికోరి ఆయన కాజల్‌ అగర్వాల్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నాడనీ సమాచారమ్‌. ఏది ఏమైతేనేం మొత్తానికి చందమామ హాలీవుడ్‌ కోరిక ఇలా తీరుతుందేమో. అయితే, ఈ విషయమై అఫీషియల్‌ క్లారిటీ రావడమే ఆలస్యం. అందుకోసం కాజల్‌ ఫ్యాన్స్‌ వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS