తెలుగు సినీ పరిశ్రమపై డ్రగ్స్ పిడుగు పడింది. టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు డగ్స్ర్ సేవిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఇప్పటికే 15 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఆ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రముఖ దర్శకుడు, ప్రముఖ ప్రొడ్యూసర్, ప్రముఖ హీరోల తనయులు, హీరోలు, హీరోయిన్లు ఇలా ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అయితే వారి పేర్లు మాత్రం బయటికి రావడం లేదు. ఈ అలజడికి టాలీవుడ్‌లో అందరూ ఆందోళన చెందుతున్నారు. అవకాశాల్లేక కొంత మంది తీవ్ర ఒత్తిడికి లోనై డ్రగ్స్‌కి అలవాటు పడుతుంటే, మంచి అవకాశాలు దక్కించుకుంటున్న వాళ్లు కూడా దుర్వ్యసనాల్లో భాగంగా ఈ మహమ్మారి భూతానికి బానిసలౌతున్నారు. ఏదేమైనా ఈ గాసిప్స్ తెలుగు సినీ పరిశ్రమని కుదిపేస్తున్నాయి. నేరం చేశారు కాబట్టి, ఆ డ్రగ్స్ ముసుగులో ఉన్న వాళ్లు ఎవరో, ఆ పేర్లు బయటికి వస్తే మిగతా వారికి టెన్షన్ తగ్గుతుంది. కానీ అది సాధ్యపడే అవకాశమేనా? ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒత్తిడికైనా, ఎంజాయ్‌ఎమెంట్ కైనా కూడా డ్రగ్స్ వాడేవారు అధికమైపోయారు. ఏ కొద్దిమందో చేసిన నేరానికి మొత్తం తెలుగు సినీ పరిశ్రమ అంతా సఫర్ కావడం ఎంతవరకూ సబబు? అందుకే ఆ నేరం చేసిన వాళ్లెవరో త్వరలో బయటికి రావాలని మిగిలిన వారు కోరకుకుంటున్నారు. మరో పక్క ఇంతవరకూ నోటీసులు అందుకున్న వారంతా ఈ నెల 19 నుండి 27 దాకా సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎక్జైజ్ శాఖ అధికారి అకున్ సబర్వాల్ సూచించారు.