దృశ్యం 2 టీజ‌ర్ టాక్‌ : జిరాక్స్ కాపీ

మరిన్ని వార్తలు

'నారప్ప'ని నేరగా ఓటీటీలోకి వదిలారు వెంకటేష్. ఇప్పుడు మరో రీమేక్ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో 2013లో విడుదలైన థ్రిల్లర్ డ్రామ ‘దృశ్యం’. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అదే టైటిల్ తో సినిమాని రిమేక్ చేసి తెలుగులో సూపర్ హిట్ అందుకున్నారు వెంకీ. ఈ సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 ఇప్పటికే విడుదలై విజయం సాధించింది. వెంకీ కూడా దృశ్యం 2ని పూర్తి చేశారు. ఈ సినిమా నారప్ప కంటే ముందే విడుదల కావాల్సింది. కొన్ని కారణాల చేత ఆగిపోయింది, ఐతే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. నవంబర్ 25న ప్రైమ్ లో ప్రసారం కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని వదిలారు.

 

దృశ్యం లో ఒక మర్డర్ కేసు నుంచి రాంబాబు(వెంకటేష్) తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేది థ్రిలింగా చూపించారు. అయితే ఆ కధకి ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. మరి ఈ ఆరేళ్ళలో ఏం జరిగింది ? రాంబాబు మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది దృశ్యం 2లో చూపించబోతున్నారు. టీజర్ విషయానికి వస్తే ఒరిజినల్ ని యాధావిధిగా ఫాలోయిపోయారని అర్ధమౌతుంది. దృశ్యం 2 కూడా సూపర్ హిట్. సెకెండ్ హాఫ్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటనేది నవంబర్ 25న తెలుస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS