రీమేక్ హక్కులతోనే రూ.కోట్లలో లాభాలు

మరిన్ని వార్తలు

తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం మూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒరిజనల్ వెర్షన్ మొదట  మలయాళంలో వచ్చింది. దీనికి  జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్, మీనా కలిసి నటించారు. మళయాలం లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో మిగతా భాషల్లో కూడా రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి ఆదరణ  పొందింది. అందరూ సూపర్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేశారు. మలయాళం లో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, తమిళ్ లో కమల్ హాసన్, కన్నడలో రవి చంద్రన్, హిందీ లో అజయ్ దేవగన్.


ఆకట్టుకునే కథ కథనం తో అందర్నీ మెప్పించింది దృశ్యం. అందుకే కేవలం  ఇండియన్ భాషల్లోనే  కాకుండా కొరియన్, ఇండోనేషియా, చైనీస్ భాషల్లో కూడా ఈ మూవీ రీమేక్ అవటం గమనార్హం. తరవాత కాలంలో దృశ్యం 2 కూడా వచ్చి ఆదరణ పొందింది. ఈ ఘనత మొత్తం జీతూ జోసెఫ్ కే దక్కుతుంది. ఒక దగ్గర హిట్ అయిన మూవీ వేరే భాషలో హిట్ అవుతుందో లేదో చెప్పలేము. కానీ ఈ మూవీ భాషా, ప్రాంతీయ బేధాలు అన్ని దాటుకుని అందరి మనసులు దోచుకుంది. ఇప్పటికీ  దృశ్యం మూవీకి క్రేజ్ తగ్గలేదని నిరూపించింది లేటెస్ట్ గా వచ్చిన ఒక న్యూస్. ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్ లో  రీమేక్ కాబోతోంది. ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ లో రీమేక్ కావటం ఇదే తొలిసారి. ఈ చిత్రం  హాలీవుడ్ లో రీమేక్ అయ్యి అక్కడ కూడా  హిట్ అయితే  సౌత్ ఇండియన్ సినిమాకి మరో గుర్తింపు దొరికినట్టే. జీతూ జోసెఫ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది.


కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి కేవలం రీమేక్ రైట్స్ ద్వారానే ఇప్పటి వరకు 40 నుంచి 50 కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయని టాక్. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై అంటోనీ పెరంబదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దృశ్యం మూవీ ఈ ప్రొడక్షన్ హౌస్ కి భారీగా లాభాలు తెచ్చి పెడుతూనే ఉంది. దృశ్యం 3 కూడా త్వరలో ఉంటుందని సమాచారం. దృశ్యం ఫ్రాంచైజ్ లో సిరీస్ లు చేయాలని జీతూ జోసెఫ్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS