దేవి బర్త్ డే.. ఉప్పెన సాంగ్ కు 100 మిలియన్లు!

By Inkmantra - August 03, 2020 - 11:26 AM IST

మరిన్ని వార్తలు

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లో ఈ మధ్య జోష్ తగ్గిందని మునుపటిలా ట్యూన్స్ అందించడం లేదని కొన్ని విమర్శలు వినిపించాయి. అయితే ఆ విమర్శకులకు సమాధానం అన్నట్టుగా దేవి శ్రీ ప్రసాద్ 'ఉప్పెన' పాటలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 'ఉప్పెన' చిత్రం నుంచి 'నీ కళ్ళు నీలి సముద్రం' అంటూ సాగే ఒక పాటను మార్చిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట 100 మిలియన్ల వ్యూస్ నమోదు చేసి సంచలనం సృష్టించింది.


ఈ 100 మిలియన్ల వ్యూస్ నమోదు చేయడంలో కూడా ఇంకో ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటకు 100 మిలియన్ మార్క్ దాటడం విశేషం. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు, హిందీ లో ఉన్న లిరిక్స్ మాత్రం రకీబ్ ఆలమ్ అందించారు. జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర ఈ పాటను ఆలపించారు.


మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వైష్ణవ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS