వోగ్‌పై తళుక్కుమన్న సూపర్‌ స్టార్స్‌!

By Inkmantra - October 05, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ వోగ్‌ ఇండియా మ్యాగజైన్‌పై మన సౌత్‌ స్టార్లు తళుక్కున మెరివారు. ఇంతకీ ఆ సౌత్‌ స్టార్స్‌ ఎవరనుకుంటున్నారా? టాలీవుడ్‌ నుండి సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కోలీవుడ్‌ నుండి నయనతార, మల్లూవుడ్‌ నుండి దుల్కర్‌ సల్మాన్‌. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేములో కనిపించిన వోగ్‌ మ్యాగజైన్‌ రేంజ్‌ పెంచేశారు. ఈ ఇయర్‌ వోగ్‌ మ్యాగజైన్‌కి ఈ ముగ్గురి అప్పియరెన్స్‌తో కొత్త గ్లామర్‌ వచ్చింది.

సూపర్‌ స్టార్‌ యాజ్‌ యూజ్‌వల్‌ యంగ్‌ లుక్స్‌లో పిచ్చెక్కించేయగా, సౌత్‌ క్వీన్‌ నయన్‌ వయసు మరీ తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. జస్ట్‌ టీనేజర్‌లా కనిపిస్తోంది. మేఘం కలర్‌ కుచ్చుల గౌను ధరించి గ్లామరస్‌ లుక్స్‌తో సెన్సువల్‌ ఎక్సప్రెషన్స్‌తో కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది. ఇక దుల్కర్‌ సల్మాన్‌ స్కై బ్లూ కలర్‌ బ్లేజర్‌లో తనదైన స్టైల్‌లో పోజిచ్చారు. ఈ ముగ్గుర్నీ కలిసి ఒకే ఫ్రేమ్‌లో చూస్తున్న అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#MaheshBabu For #VOGUEIndia magazine #SSMBForVogue #Maheshbabu #Vogue

A post shared by iQlik Movies (@iqlikmovies) on

ఈ మ్యాగజైన్‌ కోసం చేసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పెషల్‌ ఫోటో షూట్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆ పిక్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. మహేష్‌ ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాతో బిజీగా ఉండగా, 'సైరా'తో లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'వోగ్‌' క్వీన్‌ నయనతార.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS