DJ రిలీజ్ కి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి బన్నీ షాక్ ఇచ్చాడు.
అదేంటంటే- దువ్వాడ జగన్నాధం చిత్రానికి సంబంధించి మిడ్ నైట్ షోస్ కి బన్నీ నో చెప్పాడట! కారణాలు అయితే తెలియదు కాని, ముందు రోజు రాత్రి వేసే షోస్ కి మాత్రం బన్నీ ససేమిరా అనడంతో ఇక రిలీజ్ తేదీ రోజే DJ ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇక దువ్వాడ జగన్నాధం టీజర్, సాంగ్స్ టీజర్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నది. సో.. DJ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా సినిమా రిజల్ట్ పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.