భోజ్ పురి చలనచిత్రాల్లో నటించిన నటి అంజలి శ్రీవాస్తవ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే, ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివసిస్తున్న అద్దె గృహంలో అంజలి సోమవారం మధ్యాహ్నం విగతజీవిగా కనిపించింది. అయితే ఆమె ఆదివారం నుండి కుటుంబసభ్యుల, బంధువుల ఫోన్ కాల్స్ కి స్పందించకపోవడంతో ఆమె నివసిస్తున్న యజమానికి సమాచారం అందించారు.
ఆయన తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళం సహాయంతో గది తలుపు తెరవగా ఆమె ఉరివేసుకుని కనపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఆమె అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది.
అయితే సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో పోలీసులు అనుమానస్పద మృతి క్రింద కేసు నమోదు చేశారు.