బన్నీ ముందుకు.. నాని, మహేష్‌ వెనక్కి

మరిన్ని వార్తలు

మురుగదాస్‌ దర్శకత్వంంలో తెరకెక్కుతోన్న మహేష్‌ కొత్త సినిమా 'ౖస్పైడర్‌'. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహేష్‌ ఈ సినిమాని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అంతేకాదు మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు ఎస్‌. జె. సూర్య ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. జూన్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్‌ పోన్‌ అయినట్లు తెలియవస్తోంది. దాంతో ఈక్వేషన్స్‌ ఛేంజ్‌ అయ్యాయి. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌' సినిమా లైన్‌లోకి వచ్చింది. అదే డేట్‌కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాలో 'ముకుందా' భామ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన బన్నీ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరో పక్క యంగ్‌ హీరో నాని సినిమా కూడా జూన్‌ 23న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదల కూడా వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'జెంటిల్‌మెన్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఎన్టీఆర్‌తో 'జై లవ కుశ'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS