FEMA చట్టాన్ని అతిక్రమించారంటూ Enforcement Directorate వారు హీరో షారుఖ్ ఖాన్ ఆయన భార్య గౌరీ ఖాన్ అలాగే షారుఖ్ బిజినెస్ పార్టనర్ అయిన నటి జూహి చావ్లా కి నోటిసులు అందాయి.
వివరాల్లోకి వెళితే, KRSPL సంస్థ ద్వారా కోల్ కత్తా IPL జట్టుని కొనుగోలు చేసిన షారుఖ్ తరువాతి కాలంలో ఆ కంపెనీ షేర్లని మార్కెట్ రేటు కన్నా తక్కువకి ఒక ఫారన్ కంపెనీ కి అమ్మేశాడు అని తద్వారా రూ 73.6 కోట్ల రూపాయల మేర ఫారన్ ఎక్స్చేంజి నష్టం వాటిల్లింది అని తేలింది.
దీని పై KRSPL సంస్థకి డైరెక్టర్ గా ఉన్న గౌరీ ఖాన్ కి అలాగే IPLజట్టు సహా యజమానులుగా ఉన్న షారుఖ్, జూహిలకి ED వారు నోటిసులు జారీ చేశారు. ఈ కొనుగోలు వ్యవహారం 2008-09 కాలంలోజరిగినట్టు తెలుస్తుంది.
షారుఖ్ కాని జూహి కాని ఈ నోటిసుల పై ఇంకా స్పందించలేదు.