దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాతా చార్మిని ఈడీ అధికారులు విచారించారు. ఇటీవల విడుదలైన లైగర్ సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇద్దరికీ 15రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడంతో.. ఈ రోజు ఉదయం పూరి జగన్నాథ్, చార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
దాదాపు 12 గంటల పాటు విచారణ కొనసాగింది. పలు సంస్థల నుంచి పూరి, చార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధులపై ఇవాళ ఉదయం నుంచి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన లైగర్ కు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది.