పవన్ కల్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్` చేద్దామనుకొన్నాడు హరీష్ శంకర్. ఈ ప్రాజెక్టుపైనే దాదాపుగా రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టుపై హరీష్ దాదాపుగా నీళ్లొదిలేసినట్టే. అయితే.. హరీష్ ముందు ఆప్షన్లు మాత్రం ఎక్కువే ఉన్నాయి. రామ్, విజయ్ దేవరకొండ.. వీళ్లని లైన్ లో పెడుతున్నాడు హరీష్. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తోనూ టచ్‌లో ఉన్నాడు. హరీష్ - సల్మాన్ కాంబోలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఆన్‌లోనే ఉంది. ఇటీవల.. సల్మాన్- హరీష్‌ల భేటీ జరిగిందని టాక్. హరీష్ సల్మాన్‌కి ఓ కథ కూడా వినిపించాడని తెలుస్తోంది.
అయితే ఆ కథపై సల్మాన్ సంతృప్తిగా లేడని తెలుస్తోంది. దాంతో.. మరో కథని తన రైటింగ్ టీమ్ తో కలిసి రెడీ చేస్తున్నాడని సమాచారం. హరీష్ తో చేయడానికి సల్మాన్ ఉత్సాహంగా ఉన్నాడని, వీలైనంత త్వరలోనే ఈ ప్రాజెక్టు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. హరీష్ తదుపరి ఏ సినిమా చేసినా.. అది మైత్రీ మూవీస్‌లోనే. ఎందుకంటే.. మైత్రీ నుంచి అడ్వాన్స్ తీసుకొని చాలాకాలమైంది. `భవదీయుడు భగత్ సింగ్` అదే బ్యానర్‌లో చేయాలి. కానీ.. వీలు కాలేదు. అందుకే మైత్రీకి ఓ సినిమా చేసి పెట్టడం... ప్రస్తుతానికి హరీష్ ముందున్న ప్రధాన లక్ష్యం.