ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు.!

మరిన్ని వార్తలు

ఏంటీ నెంబర్‌ అనుకుంటున్నారా? ఈ రోజు విడుదలయ్యే సినిమాల సంఖ్య ఇది. ఏకంగా 11 సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి ఈ రోజు. అన్నీ చిన్న సినిమాలే. వాటిలో ఎనిమిది సినిమాలు తెలుగు సినిమాలే కావడం విశేషం. వీటిలో చెప్పుకోదగ్గవి జబర్దస్త్‌ ఫేం షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'శంభో శంకర', 'ఈ నగరానికి ఏమైంది?' తదితర సినిమాలు.

శంకర్‌ సినిమాపై అంచనాలున్నాయి. ప్రముఖ నిర్మాత సురేష్‌ కొండేటి నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇకపోతే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఇది కూడా చెప్పుకోదగ్గదే. 'పెళ్లిచూపులు' సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా పైనా అంచనాలున్నాయి.

మిగిలిన 'సంజీవనీ'. 'కన్నుల్లో నీ రూపమే' తదితర చిన్న చిత్రాలు ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటి సంగతి అటుంచితే, బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ప్రముఖ హీరో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ 'సంజూ'పైనా అంచనాలు బాగా ఉన్నాయి. హిందీ సినిమా అయినా కానీ టాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై ఆశక్తి ఎక్కువగా ఉంది.

రణ్‌వీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ జీవితంలోని పలు ఆశక్తికర సంఘటనల్ని తెరపై ఆవిష్కరించారు. అందుకే ఈ సినిమాపై చెప్పుకోదగ్గ క్యూరియాసిటీ నెలకొందనే చెప్పాలి. చూడాలి మరి ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి కానీ, వీటిలో గెలిచి నిలబడే సినిమాలెన్నో. పక్కకు వెళ్లిపోయేవెన్నో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS