ముద్దుగుమ్మలందరికీ 'ఆ' సెగ తగులుతోందే.!

By iQlikMovies - March 24, 2018 - 07:00 AM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య అందాల భామలకు అందరికీ కామన్‌గా ఎదురవుతోన్న ప్రశ్న 'కాస్టింగ్‌ కౌచ్‌'. అంటే ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలపై లైంగిక వేధింపులు. ఇప్పుడీ సమస్య ఇండస్ట్రీ నుండి బయటికొచ్చేసి, వివాదాస్పదమవుతోంది. కొందరు తెలుగమ్మాయిలు బహిరంగంగా ఈ విషయంలో తమ అనుభవాలను మీడియా ముందు బయటపెట్టేస్తున్నారు. దాంతో ఈ వివాదం రచ్చకెక్కేసింది. 

కొందరు తెలుగు భామలైతే, పచ్చిగానే ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. నిన్న మొన్నటిదాకా టాలెంట్‌ ఉంటేనే అవకాశాలు. కానీ ఇప్పుడలా కాదు.. అంటూ తమపై జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ గురించి కొంచెం పచ్చిగానే మాట్లాడేస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతోన్న ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. నాని నిర్మాణంలో వచ్చిన 'ఆ' సినిమాతో ఇంకా మంచి పేరు తెచ్చుకుందీ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు కూడా దక్కించుకుంటోంది. 

ఇలాంటి తరుణంలో ఈ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడి అనవసరంగా తంటాలు తెచ్చుకోవడమెందుకా? అని భావించింది కాబోలు. తెలివిగా నో కామెంట్‌ అనేసి ఎస్కేప్‌ అయిపోయింది.ఈ రోజుల్లో ఈ కామెంట్‌ మంచిదే. అందుకే తెలివైన పిల్ల ఈషా. ఈషాకే కాదు, స్టార్‌ హీరోయిన్స్‌ అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఇలియానా తదితర భామలకు కూడా ఈ సెగ తప్పలేదు. వీళ్లు కూడా ఈ విషయంలో ఈ మధ్య హాట్‌ అండ్‌ స్పైసీగా స్పందించిన విషయం తెలిసిందదే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS