ముంబై ముద్దుగుమ్మలకీ మన తెలుగమ్మాయిలకీ తేడా ఏంటి? ఎందుకు మన తెలుగమ్మాయిల్ని మన తెలుగు సినిమాల్లో ప్రోత్సహించడంలేదు? అనే ప్రశ్న చుట్టూ చాలా సార్లు చర్చ జరుగుతుంటుంది.
కానీ, మన తెలుగుమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు అరుదుగానే వస్తుంటాయి. చిత్రంగా తెలుగమ్మాయిల్ని తెలుగు సినిమా ప్రోత్సహించకపోయినా, తమిళ, మలయాళ సినిమాలు అక్కున చేర్చుకుంటుంటాయి. అసలు విషయానికొస్తే, ఫొటోలోని ముద్దుగుమ్మని చూశారా? అచ్చంగా ముంబై ముద్దుగుమ్మకుండే యాటిట్యూడ్‌తో, హై ఓల్టేజ్ గ్లామర్ లుక్‌తో కన్పిస్తోంది కదూ! అయితే ఈ బ్యూటీ తెలుగమ్మాయే. అదే ఆశ్చర్యం.
'అ' తదితర సినిమాల్లో నటించిన ఈషా రెబ్బా, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ముద్దుబిడ్డ. సినిమాల్లో ఛాన్సులైతే వస్తున్నాయిగానీ, స్టార్ హీరోయిన్ అన్పించుకోవాలంటే సరైన ఛాన్స్ ఒక్కటి రావాలి. ఆ ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్నానంటోంది ఈషా. ఆమె కోరుకున్న ఛాన్స్ వచ్చేలానే వుంది కదూ ఈ ఫొటోని చూస్తోంటే. పదహారణాల తెలుగందమంటే చులకన భావాన్ని పక్కన పెడితే, మన ఈషాని మన తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా చూసే రోజెంతో దూరంలో లేదు.