నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజా చిత్రం MLA గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక మొదటిరోజు నుండే ఈ చిత్రం మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంది అన్న టాక్ సొంతం చేసుకుంది.
విడుదలైన మూడు రోజుల్లో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 12 కోట్ల (గ్రాస్) & రూ 7 కోట్ల (షేర్) వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. దీనితో రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుంది అన్న దాన్ని బట్టే ఈ సినిమా కమర్షియల్ భవిష్యత్తు తేలిపోనుంది.
ఇక కళ్యాణ్ రామ్ తాజా చిత్రాలలో ఈ సినిమాకే మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా చెప్పొచ్చు. మరి ఈ చిత్రం పూర్తి రన్ టైం లో ఎంత వసూలు చేయనుందో అన్నది చూడాలి.
ఇదిలావుండగా కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నా నువ్వే అనే లవ్ స్టొరీ లో నటిస్తున్నాడు.