అందాల ఈషా గ్లామర్‌ అదిరెనహో.!

By iQlikMovies - May 23, 2018 - 11:54 AM IST

మరిన్ని వార్తలు

అచ్చమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బ యాక్టింగ్‌ టాలెంట్‌తో పాటు, గ్లామర్‌లోనూ టాప్‌ లెవలే అని చెప్పాలి. ఈ ముద్దుగుమ్మకి సరైన అవకాశం రాలేదు కానీ, గ్లామర్‌లో గీతలు దాటేందుకైనా వెనుకాడదు. అయితే అలాంటి బీభత్సమైన గ్లామర్‌ క్యారెక్టర్‌ ఇంకా ఈ ముద్దుగుమ్మ తలుపు తట్టలేదనే చెప్పాలి. ఈ మధ్యనే 'అ' చిత్రంలో డిఫరెంట్‌ రోల్‌ పోషించి తనలోని నటికి ఛాలెంజ్‌ విసిరి, శభాష్‌ అనిపించుకుంది. మరిన్ని మంచి అవకాశాలు రాబట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్‌ మీడియాలో వీలు చిక్కినప్పుడల్లా తాజా తాజాగా అందాలారబోస్తూ ఫోటోలకు పోజిచ్చేస్తుంటుంది. ఇదిగో ఈ ఫోటో చూశారుగా, బ్లాక్‌ డ్రస్సులో ఈషా అరవిరిసిన అందం అదరహో అనిపించట్లేదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS