'అల్లుడు' వాడకం మొదలెట్టాడు.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు తేజు మేనమామ చిరంజీవిని విచ్చల విడిగా వాడుస్తుంటాడు. పాటల దగ్గర్నుంచీ, స్టైల్‌ వరకూ అచ్చం మేనమామని అలా దించేస్తూ ఉంటాడు. ఆ కోవలోనే చిరంజీవి 'సుప్రీమ్‌' టైటిల్‌ని తీసేసుకున్నాడు తేజు. ఇప్పుడు చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కూడా మామను వాడడం మొదలెట్టేశాడు. 

చిరంజీవి కెరీర్‌లోనే ది బెస్ట్‌ ఫిలింస్‌ అనదగ్గ వాటిలో ఖచ్చితంగా ఉండే సినిమా 'విజేత'. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కుటుంబం కోసం కిడ్నీని దానం చేస్తాడు చిరంజీవి. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా, గోల్‌ కీపర్‌ పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు ఆ సినిమాలో. నటుడిగా విజేత అనిపించుకున్నాడు చిరంజీవి ఆ సినిమాతో. గొప్ప గొప్ప సినిమాల టైటిల్స్‌ని వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది మెగా కాంపౌండ్‌ నుండి వస్తున్న కళ్యాణ్‌దేవ్‌, మామ చిరంజీవి 'విజేత' గౌరవాన్ని నిలబెడతాడా? లేదా ? చూడాలిక. 

రాకేష్‌ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాళవికా నాయర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్టుగా ఈ సినిమా టైటిల్‌ లోగోని రిలీజ్‌ చేశారు. చాలా ఇంప్రెసింగ్‌గా ఉంది ఈ టైటిల్‌ లోగో. ఓ చేయిని ఇంకో చేయి పట్టుకున్నట్లుగా ఉంది. సాయం కోసం చేయి అందించడం అన్న అర్ధం వచ్చేలా ఉంది ఈ లోగో. 

'లైటింగ్‌ ఆఫ్‌ స్మైల్స్‌ ఆన్‌ అదర్స్‌ ఫేసెస్‌, ఈజ్‌ ఆల్సో ఏ సక్సెస్‌' అనే క్యాప్షన్‌ని యాడ్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS