గ్లామర్ అంటే ఓవర్ డోస్‌లో ఎక్స్‌పోజింగ్ చేసేయ్యడం మాత్రమే కాదు. అందమైన నవ్వులో కూడా బోలెడంత గ్లామర్ ఉంటుందంటోంది ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. 'అమీ తుమీ' సినిమాతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందే ఓ సినిమాలో నటించింది. అదే 'అంతకు ముందు ఆ తర్వాత'. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిందీ సినిమా.
తొలి సినిమాకే నటనలో మంచి పేరు తెచ్చుకుంది. 'అమీ తుమీ' సినిమా బాగా పేరు తెచ్చిపెట్టింది. గ్లామర్‌లో పెద్దగా అభ్యంతాలు లేకపోయినప్పటికీ, మరీ విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేసే అవకాశమే ఇంకా వరించలేదు ఈ ముద్దుగుమ్మని. ఎక్స్‌పోజింగ్ చేయడానికి నో అబ్జక్షన్స్..అయితే అంతకన్నా మించి బెస్ట్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకోవాలని ఉందంటోంది ఈషా. తాజాగా ఈ ముద్దుగుమ్మ నాని సమర్పణలో వస్తోన్న 'అ' చిత్రంలో ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తోంది.
ముక్కుకు 'ఓం' అనే ముక్కెరతో చాలా స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటోందీ బ్యూటీ 'అ'లో. గ్లామర్‌తో పాటు ఈ అందాల భామలో ఏదో విషయం ఉంది. ఇటు గ్లామరస్ లుక్‌లో సెక్సప్పీల్ పండించడానికైనా, అమాయకపు ఫేస్‌తో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్‌కైనా ఇట్టే మ్యాచ్ అయిపోయే ఫీచర్స్ ఈ ముద్దుగుమ్మ సొంతం. అందులోనూ పదహారణాల తెలుగందం. మంచి టాలెంటెడ్.
ప్రస్తుతం ఇతర భాషా నటీమణుల హవా కొనసాగుతోంది మన తెలుగు సినిమాకి. ఈ తరుణంలో మన అచ్చమైన తెలుగందాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో చూడాలి మరి. 'అ' సినిమాతో ఈషా కెరీర్‌లో మరో స్టెప్ ముందుకెళ్లాలనీ ఆశిద్దాం.